చదలవాడ అరవిందబాబుకు జైకొట్టిన ఆర్యవైశ్యలు

-ముక్తకంఠంతో మద్దతుగా నినాదాలు
-గోపిరెడ్డికి గుణపాఠం చెబుతామని వెల్లడి
-ఐదేళ్లుగా వ్యాపారాలపై వేధింపులు చేశారు
-జే ట్యాక్స్‌ బాదుడుకు నష్టాల్లో కూరుకుపోయామని ఆవేదన

పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబును గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులంతా ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని వినాయక, వాసవీ టవర్స్‌, గుప్తా ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్‌లలో చదలవాడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఘన స్వాగతం పలికారు. తమలో ఒకరిగా తోడుగా నిలిచిన అరవిందబాబుకు అండగా ఉంటామని తెలిపారు. ఆర్యవైశ్యులను వేధించి వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అవస్థలు పెట్టిన గోపిరెడ్డికి గుణపాఠం చెబుతామని హితవుపలికారు. దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తు న్నా ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జే ట్యాక్స్‌, గోపిరెడ్డి ట్యాక్స్‌ బాదుడుకు వ్యాపారాలు కుదేలయ్యాయని మండిపడ్డారు. బాదుడు లేని, బాసటగా నిలిచే కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

అచ్చయ్యపాలెంలో ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం అచ్చయ్య పాలెం గ్రామంలో కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరా యలు సతీమణి డాక్టర్‌ మేఘన పర్యటించారు. నరసరావుపేట పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు.