నరసరావుపేట: సర్వజన మందిర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 2024 ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య భవనంలో సర్వజన మందిర్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు లేగల సాయి శ్రీనివాస్ దంపతులు చేతులమీదుగా అందజేశారు. ఉత్తమ అవార్డు గ్రహీత స్వర్ణ నాగరాజును సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.