-జనసేన కార్యకర్తపై దాడి అమానుషం
-ఏ రోజైనా సీఎం స్పందించారా?
-టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్
మంగళగిరి: నంద్యాల పార్లమెంట్ పాణ్యం నియోజకవర్గం తడకనపల్లి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్త సలాం అనే యువకుడిపై వైసీపీ రౌడీ మూకలు అమానుషంగా దాడి చేయటాన్ని టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఖండిరచారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతో పొత్తును తెరపైకి తెచ్చి రాష్ట్రంలో ముస్లింలను భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మైనారిటీలపై దాడులపై ఒక్క రోజు అయినా సీఎం జగన్ స్పందించిన పాపాన పోలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఓర్చుకోలేకనే సలాంపై దాడి చేశారన్నారు. 2019-24 వరకు వైసీపీ తెరవెనుక బీజేపీతో అంటకాగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి మద్దతు పలుకుతున్నామని బహిరంగంగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించింది వాస్తవం కాదా? సమాధానం చెప్పాలని కోరారు. మీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. ఏం అభివృద్ధి, సంక్షేమం చేశారో చెప్పకుండా మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారు… మీ తాట తీసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారన్నారు. మీ అరాచకాలకు తట్టుకోలేక రాష్ట్రంలో ఎంతోమంది బలయ్యారన్నారు.
2014లో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ దేశంలో మొట్టమొదటిసారిగా ఇమాంలకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు జీతాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రంజాన్ తోఫా, దుకాన్-మకాన్, మసీద్ మరమ్మతులకు నిధులు, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య వంటి కార్యక్రమా లు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే చంద్రబాబు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. 120 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీకి స్థలం కేటాయించి 60 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబా బుదన్నారు, కడపలో రూ.25 కోట్లతో హజ్ హౌస్ నిర్మిస్తే దానిని కోవిద్ సెంటర్ కింద మార్చి వైసీపీ ప్రభుత్వం మైనార్టీలతో చెలగాటమాడిరదని విమర్శించారు. కరెంటు బిల్లులు తొమ్మిది సార్లు పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. పన్నుల బాదుడు, గ్యాస్, ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై భారం మోపి దోచుకుంటోందని, రెవెన్యూ శాఖలో ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారో సబ్ రిజిస్ట్రార్లు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు