-చదలవాడ, శ్రీకృష్ణదేవరాయలు సమక్షంలో చేరిక
-వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ధ్వజం
నరసరావుపేట, మహానాడు: కూటమి జోరుకు నరసరావుపేట వైసీపీ గుడారంలో వణుకు మొదలవుతోంది. గత వారం రోజులుగా వేలాది వైసీపీ కుటుంబాలు నరసరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. సోమవారం కూడా నరసరావుపేట 34వ వార్డు రామానగర్‌లో 30 యాదవుల, కుమ్మర కుటుంబాలు, 7వ వార్డులో 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు, జనసేన ఇన్‌చార్జి సయ్యద్ జిలాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల రాష్ట్రానికి, నియోజకవర్గానికి ఒరిగింది లేదన్నారు.