-పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ
-మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తా
-పసుపుబోర్డును తీసుకువస్తా
-జీవన్‌రెడ్డిని గెలిపించండి…మంత్రిని చేస్తా
-కేసీఆర్‌ను ఎప్పుడో పాతిపెట్టారు
-నిజామాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నిజామాబాద్, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానం..మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.. వందరోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తామని కేసీఆర్ మోసం చేశారు…వరి వేస్తే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్‌ది.. అందుకే ఆయనను రాజకీ యంగా వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారు.. నిజామాబాద్ రైతులను మోసం చేస్తే శాశ్వ తంగా రాజకీయ సమాధి చేస్తామని ఇక్కడి రైతులు నిరూపించారు.. బండిని, గుండును నమ్మరని గత ఎన్నికల్లో ఐదురోజుల్లో పసుపుబోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారు… స్పైసెస్ బోర్డును తెచ్చి అదే పసుపు బోర్డు అని చెబుతున్నారు… స్పైసెస్ బోర్డుకు, పసుపు బోర్డుకు తేడా తెలియదా మా నిజామాబాద్ రైతులకు? అని ప్రశ్నించారు. హర్యానా రైతుల తరువాత ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది..ప్రభుత్వం మెడలు వంచి వారి సమస్యలను పరిష్కరించుకునే సత్తా రైతులకు ఉంది.
రైతులకే తన జీవితం అంకితం చేయాలనుకుంటున్నానని జీవన్ అన్న నాతో చెప్పారు.. ఖచ్చితంగా దేశంలో ఇండియా కూట మి అధికారంలోకి వస్తుంది. జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే… సోనియమ్మ, రాహుల్ గాంధీని ఒప్పించి అన్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత తనదని ప్రకటిం చారు. కేంద్ర మంత్రిగా పసుపుబోర్డు తీసుకొచ్చి జీవన్ అన్న నిజామాబాద్ రైతుల కోరిక తీరుస్తారు..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మాట్లాడుతున్నారు..రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ..మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.. ఓటమి భయంతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. రాముడు మీకే కాదు… మాకూ దేవుడే.. ఇతర మతాలను గౌరవిస్తామని తెలిపారు. బాసర సరస్వతీదేవి సాక్షిగా చెబుతున్నా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తమదే…జీవన్ రెడ్డిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.