-నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన చిరంజీవిరెడ్డి
-చంద్రబాబు నేతృత్వంలోనే పోలీసు సంక్షేమం సాధ్యమని వెల్లడి
మంగళగిరి: ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి మంగళవారం తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే మంగళగిరి కొండపనేని టౌన్ షిప్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ కండువా కప్పి చిరంజీవిరెడ్డి, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక తాను ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లు చిరంజీవి రెడ్డి చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించి పోలీసుల సంక్షేమానికి కృషిచేస్తారని నమ్మి తాము టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక పోలీసు సోదరులు కూడా అన్నివిధాలా నష్టపోయారని తెలిపారు. కొందరు ఉన్నతస్థాయి పోలీసు అధికారులు మాత్రం తమ వ్యక్తిగత స్వార్థం కోసం జగన్కు కొమ్ముకాస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి పోలీసులపై పనిభారం తగ్గిస్తామని తెలిపారు.