విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమలో సుజనాచౌదరి విజయం కోసం టీడీపీ మాజీ కార్పొరేటర్, 41,42 డివిజన్ల క్లస్టర్ ఇన్‌చార్జ్ యేదుపాటి రామయ్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమలో సుజనాను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి అభ్యర్థించారు. రామయ్య వెంట బూత్ ఇన్‌చార్జ్‌లు నెలకుర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్, మైనంపాటి రమేష్, కాశీ, పత్చవ మల్లికార్జున, వెంకట్, మహేష్, శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నారు.