నాయీ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాం

చిరువ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
ప్రజలతో మమేకమై..సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దేవాలయ పాలకవర్గాలలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉంది..మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తాం.. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలం కేటాయిస్తామని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. దర్శి పట్టణంలో ప్రచారంలో భాగంగా మంగళవారం చిరు వ్యాపారులతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రెంట్‌ బిల్లుల పెంపు, గ్యాస్‌ ధరల పెంపు, పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపుతో సామాన్యులు బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన లక్ష్మి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించి వారి బతుకుల్లో మార్పు కోసం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలుచేయనున్నా రని వివరించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని కటింగ్‌ కోసం ఒక బార్బర్‌ షాపునకు తీసుకువెళ్లి షాపు యజమానితో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.