ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత కల్పించాలి
కలెక్టరుకు నరసరావుపేట అభ్యర్థి చదలవాడ వినతి

నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టరును కలిసి వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నా రు. రిగ్గింగ్‌కు పాల్పడి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పోలింగ్‌ బూతులకు వెళ్లకుండా అడ్డుకున్నారని వివరించారు. మరో వైపు దాడులు, దౌర్జన్యాలతో ఓటర్లను బెదిరించిన ఘటనలు ఉన్నాయని, మరోసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరా రు. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌, బూత్‌ క్యాప్చరింగ్‌ వంటి ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి స్వేచ్ఛగా ప్రజల ఓటు హక్కు వేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.