గుంటూరు పశ్చిమలో వైసీపీకి భారీ షాక్‌

గంపగుత్తగా టీడీపీలోకి భారీగా చేరికలు
డివిజన్లలో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత

గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతు న్నాయి. తాజాగా బుధవారం గుంటూరు నల్లచెరువుకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు షేక్‌ షంషున్‌ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి గుంటూరు పశ్చిమ నియో జకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి కండువాలు కప్పి ఆహ్వానించారు. 25వ డివిజన్‌ ఆదర్శ్‌ నగర్‌లో డివిజన్‌ అధ్యక్షుడు గాలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి సుమారు 256 మంది తెలుగుదేశం పార్టీలో చేరగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి కండువాలు కప్పి ఆహ్వానించారు. 30వ డివిజన్‌ లోనూ వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ డివిజన్‌లో వైసీపీ నేతలు టీడీపీ అధ్యక్షుడు కురంగి శ్రీని వాస్‌, పేరం అనిత ఆధ్వర్యంలో గళ్లా మాధవి సమక్షంలో పార్టీలో చేరారు.