ఆదాయం పెంచి సంక్షేమం అందిస్తాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి రూరల్‌ మండలం గర్నెపూడి, పెద్దమక్కెన గ్రామాలలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి సూపర్‌ సిక్స్‌ పథకాలు, మేనిఫెస్టో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవడంతో జనం వైసీపీకి ఓట్లు వేయరని తెలిసిపోయింది. నకిలీ రత్నాల మేనిఫెస్టోతో జగన్‌ రెడ్డి చేతులెత్తేశాడు. కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోతో పేదలకు లబ్ధి చేకూరుతుంది. గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ కు ఒక పరిశ్రమ కూడా రాలేదు. అభివృద్ధి లేదు..ఉపాధి లేదు. యువత జీవితం అంధకారంలోకి పోయింది. జగన్‌ ఐదేళ్ల పొలంలో విధ్వంసం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. చెప్పేవన్నీ అబద్ధాలు…చేసేవన్నీ డ్రామాలు. భూ రక్షణ చట్టం ప్రమాదకరమైనది. ఆ చట్టం వస్తే మీ భూమి, ఆస్తులు వారి పేర్లతో రాసుకుం టారు. అందుకే వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.