మల్లెపూల రైతుల కష్టాలు తెలుసు…

కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరిస్తాం
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా

దర్శి, మహానాడు : దర్శి మండలం చలివేంద్ర, అబ్బాయిపాలెం, నడిమిపల్లి, కొత్తూరు, వెంకటాచలంపల్లి, తానంచింతల గ్రామాల లో శుక్రవారం శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటాచలం పల్లె కొత్తూరు గ్రామంలో మల్లెపూల తోటలోకి వెళ్లి రైతు వేదన విన్నారు. మారెడ్డి శ్రీనివాసరావు అనే రైతు మాట్లాడుతూ ఒక ఎకరం మల్లెతోట వేశానని, కేవలం కిలో రూ.100 కావడంతో గిట్టుబాటు కావడం లేదని చెప్పాడు. అదేవిధంగా మల్లెపూలు కోసే వ్యవసాయ కూలీలు తమ గోడు చెప్పుకున్నారు. కూలి కూడా రావడం లేదని ధరలు లేనప్పుడు రైతులు కూడా ఇవ్వడం కష్టమవుతుందని తెలిపారు.

కొనబోతే కొరివి అమ్మబోతే అడవి లాగే ఉందని వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మల్లెపూల తోటల రైతుల సమస్యలు తెలుసు. కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, ధరలు లేకపోవడంతో వారు పడుతున్న వేదనను నేను అర్థం చేసుకున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన గొట్టిపాటి ఆడబిడ్డను. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మీ కష్టాలు తీరుతాయి. రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించి గిట్టుబాటు ధరలు ఉండే విధంగా మన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాక రైతుకు అండగా నేనున్నానంటూ మల్లెపూలు కొన్నారు. 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండలం లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.