ఆడబిడ్డలపై వైసీపీ మూకల అసభ్యకర పోస్టులు

మార్ఫింగ్‌ చిత్రాలపై ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ లేదు
ఎఫ్‌ఐఆర్‌ నమోదు…భారతీరెడ్డికి మాత్రమే సాధ్యం
కనీసం ట్విట్టర్‌ నుంచైనా డిలీట్‌ చేయించండి
ఏమి చేశాడని ట్విట్టర్‌ జోకర్‌ ఆర్జీవీకి డబ్బు ఇచ్చారు?
కూటమి వచ్చాక ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం
టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి

అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలపై ట్విట్టర్‌లో వైసీపీ మూకలు అసభ్యకరంగా చిత్రాలు పెడుతున్నారని, ఫిర్యాదు చేసి నాలుగు రోజలవుతున్నా నేటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశా రు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఈవోను కలిసి తక్షణమే ఈ విషయంపై జోక్యం చేసుకుని మార్ఫింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో డిలీట్‌ చేయించాలని ఆనం కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆనం మాట్లాడారు. ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్న సంస్కార హీనులు వైసీపీ మూకలు..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దిగజారి ప్రవర్తిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు మహిళా నాయకులపై ఘోరంగా అర్ధనగ్న మార్ఫింగ్‌ చిత్రాలను వైసీపీ సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో సర్క్యులేట్‌ చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు? గతంలో ఆర్కెే రోజాను ఏదో అన్నారని వాసిరెడ్డి పద్మ బోరున ఏడ్చేసి అన్ని చిత్రపరిశ్రమల నటులతో మాట్లాడిచ్చారు. నేడు నలుగురు ఆడబిడ్డలపై ఇంత దారుణంగా మార్ఫింగ్‌ చిత్రాలను ప్రచారం చేస్తుంటే ఎక్కడకు పోయింది మహిళా కమిషన్‌? అంటే తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డలు ఆడబిడ్డలు కాదా అని ప్రశ్నించారు. ఇటువంటివి వ్యవస్థకు మంచిది కాదు, ఇటువంటి ఘోరాలను అరికట్టాల ని, తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్‌ మిశ్రా మాకు చెప్పారు.

రాష్ట్రంలో వైఎస్‌ పోలీసు యంత్రాంగం మాత్రమే ఉంది. వాళ్లు ఇటువంటి ఫిర్యాదులు తీసుకోరని మిశ్రాకు మేము చెప్పాం. ఆయన మీరు ఇవ్వండి నేను మాట్లాడుతానని మాకు హామీ ఇచ్చారు. ఏలూరు టూటౌన్‌లో మేము ఫిర్యాదు చేస్తే నేటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. మీరు మారరా అని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా కూడా మార్ఫింగ్‌ చిత్రాలపై చర్యలు తీసుకొని అటువంటి పనులు చేస్తున్న వారిని గుర్తించి ఆరెస్టు చేయాలని, మార్ఫింగ్‌ చిత్రాలను డిలీట్‌ చేయాలని ఏలూరు పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. కానీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాదు కదా మార్ఫింగ్‌ చిత్రాలను చేస్తున్న అగంతుకులను పట్టుకుని ప్రశ్నించే ధైర్యం కూడా ఏలూరు టూటౌన్‌ పోలీసులు చేయడం లేదు. పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి గారికి నా మనవి…
రాష్ట్రంలో ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించగల ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి సతీమణి వై.ఎస్‌.భారతీరెడ్డి మాత్రమే. మీ పలుకుబడిని ఉపయోగించి ఆడబిడ్డలపై మార్ఫింగ్‌ చిత్రాలను సోషల్‌ మీడియాలో నుంచి తొలగించాలని పోలీసులకు చెప్పండి. మీకు ఆడబిడ్డలున్నారు. నాకు ఆడబిడ్డలున్నారు. మనం మనం రాజకీయాలు చేసుకుందాం కానీ, ఆడబిడ్డలపై మార్ఫింగ్‌ చిత్రాలు సర్క్యులేట్‌ చేసే నీచ సంస్కృతిని ఉపయోగించి రాజకీయాలు చేయకూడదు. వీలైతే ఇటువంటి పనులు చేస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు చెప్పండని ఆనం కోరారు.

ఆర్జీవీ లెక్కలు తేలుస్తాం
మాపై మార్ఫింగ్‌ చిత్రాలు తయారు చేసి వైసీపీ సోషల్‌ మీడియా సర్క్యులేట్‌ చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు వారి బాధను తెలుపుకోవడానికి వచ్చి ఎన్నికల సంఘం భవనం ముందు ఫొటో దిగారు. దానిని ట్విట్టర్‌ జోకర్‌ రామ్‌గోపాల్‌ వర్మ మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశాడు. ఆడబిడ్డల గౌరవానికి సంబంధించిన విషయాన్ని కూడా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఆడబిడ్డల ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్న వారిని తిట్టాల్సింది పోయి అతనే మార్ఫింగ్‌ లు చేస్తున్నాడు. నువ్వేమైనా నితీమంతుడువా వర్మ? అని ప్రశ్నించారు. మార్చి నెలలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.67,62,712 ఒకసారి, రూ.47,33,898 మరోసారి వర్మ కంపెనీ ఖాతాలో జమయ్యాయి. న్యూడ్‌ మోడలింగ్‌ చేసినందుకు ఈ డబ్బులు ఇచ్చారా? లేదా మోడలర్స్‌ను తీసుకొచ్చి రాష్ట్రంలో షో చేసినందుకు డబ్బులు ఇచ్చారా? మరి ఎందుకు జమయ్యాయి అనే దానిపై క్లారిటీ ఇవ్వాలి.

ఎన్నికల కోడ్‌ వస్తుందన్న రెండు రోజులు ముందే ఎందుకు వర్మకు ఇచ్చారు? మేము కూడా మీపై మార్ఫింగ్‌లు చేసి పెట్టగలము. కానీ మాకు సంస్కారం, వ్యక్తులపై గౌరవం ఉంది. ఒకవేళ ఎవరైనా చేస్తున్నారని తెలిసనా మా అధినేత చంద్రబాబు నాయుడు ఉపేక్షించరని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ వ్యవహారాలపై ఎటూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తాం. ఈ లోపు వైరల్‌ అవుతున్న మార్ఫింగ్‌ ఫొటోలను సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇకనైనా వైసీపీ నాయకులు మారి ఆడబిడ్డలను హేళన చేయకుండా సంస్కారంగా రాజకీ యాలు చేయండని హితవుపలికారు.