కూటమి నేతల రాకతో జోష్‌

టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌

నెల్లూరు, మహానాడు: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడారు. మూడు పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు పర్యటన కూటమి శ్రేణుల్లో జోష్‌ నింపిందని వివరించారు. ఈ సమావేశంలో కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.