రాహుల్‌ గాంధీ సభను దిగ్విజయం చేయండి

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాల్‌, మహానాడు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గద్వాల్‌ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించే రాహుల్‌ గాంధీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రవల్లిలో సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. భారీ బహిరంగ సభకు ఉమ్మడి పాలమూర్‌ జిల్లా నుండి పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని సూచించారు.