విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి
విజయవాడ, మహానాడు : దుష్ట పార్టీ వైసీపీని వీడి భారీఎత్తున యువత బీజేపీలో చేరి సరైన నిర్ణయం తీసుకున్నారని విజయవాడ పశ్చి మ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. విజయవాడ లంబాడీపేట నుంచి మాజీ కార్పొరేటర్ తాజా నోత్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు శనివారం బీజేపీలో చేరా రు. వారికి సుజనాచౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి మాట్లాడు తూ రవి ఆధ్వర్యంలో వీరంతా బీజేపీలో చేరడం సంతోషం కలిగిస్తోం దన్నారు. మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలన్నది తన అభిమతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ పాల్గొన్నారు.