హామీలు నెరవేర్చకుండా జగన్‌ మోసం

పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌

నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి – బెల్లం కొండ రహదారిలో కల్వర్టులు ఇంకా పూర్తి చేయలేదని, గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కృష్ణా నదిపై వారధి నిర్మించిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్‌ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్‌, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు, నాయకులు కొండ్రగుంట రంగారావు, తిరుమల కొండ నరసింహా రావు, దండా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.