నేత కార్మికులకు ఉపాధి హామీ

మంత్రి కొండా సురేఖ

దుబ్బాక, మహానాడు : కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా దుబ్బాకలోని చేనేత సహకారం సంఘం కర్మాగారంలో బుధవారం ఆమె ప్రచారం చేపట్టారు. కర్మాగారంలో పనిచేస్తున్న చేనేత కార్మికులను కలిసి వారితో మాట్లాడారు. నేత కార్మికులను ఉపాధి హామీలో భాగం చేసే దిశగా రాహుల్‌ గాంధీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్‌ నాయకులు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.