వైసీపీ బెదిరింపులకు తలొగ్గని ఓటర్లు
హత్యలు, రక్తపాతంతో ప్రజాతీర్పును మార్చలేరు
కలెక్టర్లకు సీఎం పేషీలోని ధనుంజయ్‌రెడ్డి ఆదేశాలు ఏమిటి?
పోలింగ్ బూత్‌ల దగ్గర జగన్‌రెడ్డి ముఠా అరాచకాలు
శాసనమండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్
అమరావతి, మహానాడు : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో జనాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పండుగలా అనిపిస్తోంది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తిరుగుబాటుకు నిదర్శనమని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేకతను గమనించిన వైసీపీ శ్రేణులు అరాచకాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై దాడులకు తెగబడ్డారు. అతని కారును ధ్వంసం చేశారు. రిగ్గింగ్‌కు అవకాశం లేకుండా పోలింగ్ నిర్వహిస్తున్న ఏజెం ట్లపై దాడులు చేసి బయటకు తరిమేశారు.
నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయ లు, అరవిందబాబు కార్లపై దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారుడు ప్రత్యక్షంగా దాడులకు తెగబడ్డారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి మహిళ లను కారుతో తొక్కించేందుకు ప్రయత్నించారు. చీరాలలో కొండయ్యపై దాడికి పాల్పడ్డా రు. శ్రీకాకుళంలో గొండు శంకర్‌పై పోలింగ్ బూత్‌లోనే దాడి చేశారు. తిరువూరులో కేశినేని చిన్ని కారును ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలను హైజాక్ చేసేందుకు జగన్ రెడ్డి ముఠా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
ఓటమి భయంతో రిగ్గింగ్‌కు యత్నం
బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని గెలిపిం చుకోవాలని ముందుకు వచ్చారు. మధ్యాహ్నానికే ఏకంగా 60 శాతం వరకు పోలింగ్ పూర్తవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ ను ఓడిరచే లక్ష్యంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. విజయవాడ పశ్చిమలో వైసీపీ అభ్యర్థి ఏకంగా పోలీసులపై వీరంగం సృష్టించారు. గుంటూరులో బీజేపీ నేత సునీల్‌పై ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాడికి పాల్పడ్డారు. రాజమండ్రిలో పోలింగ్ బూత్‌ల వద్ద బ్లేడ్ బ్యాచ్‌ని రంగం లోకి దింపాడు. తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెగబడ్డాడు.
తెనాలిలో ఓటరుపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పేషీలో ఓఎస్డీగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి వైసీపీ నేతలకు మేలు చేసేలా వ్యవహరించాలంటూ కలె క్టర్లకు సూచనలిస్తున్నారని ఆరోపించారు. జనసేన అధికార ప్రతినిధి కె.కె.శరత్ మాట్లా డుతూ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన ఓటుహక్కును హరించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఓటమి ఫిక్స్ అయిపోయిం దనే అసహనంతో దుర్మార్గాలకు పాల్పడు తున్నారు. ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేయడం హేయమ ని ఖండిరచారు.