అమరావతి, మహానాడు: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు వివరించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయని తెలిపింది. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచిం దని వెల్లడిరచింది. తర్వాతి మూడు స్థానాల్లో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది.