మత్తు ఇంజక్షన్‌ వికటించి యువతి మృతి

-కాలులో ప్లేట్స్‌ తీయించుకునేందుకు వచ్చి…
-డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతిచెందిన బంధువుల ఆరోపణ

విజయవాడ, మహానాడు: స్థానిక ఎం.జె.నాయుడు ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్‌ వికటించి రికిత(19) అనే యువతి మృతిచెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు బంధువులు ఆరోపి స్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయించుకున్న రికిత కాలులో ప్లేట్స్‌ ఉండ డం వల్ల దాన్ని తీసివేయడానికి బుధవారం ఆపరేషన్‌ చేయించేందుకు ఆసుప త్రికి వచ్చింది. ఉదయం 11 గంటలకు డాక్టర్లు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకు వెళ్లారు. రాత్రి 10.30కు రికితకు సీరియస్‌గా ఉందని, వెంటిలేటర్‌ పెట్టామని కుటుంబసభ్యులు అడగటంతో బదులిచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆపరేషన్‌ థియేటర్‌లో ఏం చేశారన్నది సమాచారం లేదు.