నంద్యాల: గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో జరిగింది. వన్‌టౌన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి(46) శుక్రవారం తెల్లవారుజామున స్టేషన్‌లోని రెస్ట్ రూములో ఉన్నట్లుండి గన్నుతో తలపై కాల్చుకున్నాడు. పోలీసులు వెళ్లి చూడగా మృతిచెం ది ఉన్నాడు. ఆయన కర్నూలు వాసిగా గుర్తించారు.