తాడిపత్రి అల్లర్లకు పెద్దారెడ్డి, కుమారుడే కారణం

టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్‌

తాడిపత్రి, మహానాడు : తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు ముఖ్య కారణం వైసీపీ అభ్యర్థి పెద్దారె డ్డి, ఆయన కుమారులే కారణమని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రి ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని జీర్ణిం చుకోలేక ఓటమి భయంతో బూత్‌లో టీడీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై పెద్దారెడ్డి స్వయాన దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడన్నారు. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌ రెడ్డి అక్కడికి చేరుకోగా ఆయన కారుపై రాళ్ల దాడి చేసి ధ్వంసం చేశా రని తెలిపారు. అయినా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నికలు సామరస్యంగా జరగాలన్న ఉద్దేశంతో వెళ్లిపోయారన్నారు.