నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘా పెంచండి
ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్ అదేశాలు
హైదరాబాద్, మహానాడు : ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతోపాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్ లో శుక్రవారం తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సమీక్ష జరిగిం ది. నాటుసారా తయారీ మళ్లీ తెలంగాణలో 26 ఎక్సైజ్ శాఖ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నట్లు దాడుల్లో బయటపడిరదన్నారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్, పోలీసులు కలిసి నాటుసారాను మూడునెలల్లో తుదముట్టించాలని అధికారులను ఆదేశిం చారు. నాటుసారా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు.
నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘా ఉంచండి
నాటుసారాతో పాటు ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తున్నట్లుగా బహిర్గతమైందన్నారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను తెలంగాణలోకి రాకుండా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేకమైన నిఘా పెట్టి దాడులు నిర్వహించాలన్నారు. ఈ మధ్యకాలంలో పట్టణాల్లోను, ఫంక్షన్ హల్స్, ఫామ్‌హౌజుల్లో జరిగే పార్టీలకు మద్యం కావాలని ఎక్సైస్ శాఖ అనుమతులు ఇస్తుంది. కానీ సగం మద్యాన్ని మద్యం దుకాణాల్లో తీసుకుని మిగిలిన సగం మద్యాన్ని నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను వినియోగిస్తున్నారనే ప్రచారం జరుగు తుందని, వాటిపై నిఘా పెట్టాలని కమిషర్ సూచించారు.
బీరు నిల్వలపై చర్యలు చేపట్టాలి
ప్రధానంగా వేసవిలో బీరు స్టాక్ లేదనే వార్తలు వస్తున్నాయని, రికార్డుల ప్రకారం పరిశీలిస్తే గత సంవత్సరం కంటే ఎక్కువ బీరు నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయని, ఈ విషయంలో అవసరమైన దాడులు నిర్వహించి మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అదేశిం చారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కోర్టుల కేసులు, వాణిజ్య పన్నుల శాఖ సూచనలను పాటించాలని అన్నారు. నాటుసారా తయారీకి వినియోగించే ముడి సరుకుల రవాణాపై ప్రత్యేక నిఘా పెంచి దాడులు నిర్వహించి నాటుసారా తయారీని తుదిముట్టించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అన్నారు.
ఆగస్టు నాటికి పూర్తిగా నిర్మూ లించడానికి ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణ చేపట్టాలని అదేశించా రు. నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని, కల్తీ కల్లు తయారీకి వినియోగించే సిహెచ్, అలం, డైజోఫాం వంటి పదార్థాలను దాడులు నిర్వహించి పట్టుకోవాలని సూచించారు. గంజాయి, నార్కోటిక్, ఇతర మత్తుమందుల తయారీ, దిగుమతి, అమ్మకాలపై నిఘా పెట్టి పట్టుకోవాలని ఆదేశించారు. అవసరమైతే తెలంగాణలో పలు జిల్ల్లాల్లో పోలీసుల సహకారం తీసుకుని నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపాలని కోరారు. సమావేశంలో తెలంగాణ జిల్లాల ఏసీలు, డీసీలు, డీపీఈవోలు హాజరయ్యారు.