ఏపీలో అల్లర్లపై సిట్‌

-వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో 13 మందితో ఏర్పాటు
-ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
-విచారణ తర్వాత నివేదిక ఇవ్వనున్న బృందం

అమరావతి, మహానాడు
రాష్ట్రం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సం బంధించి పోలీసులపై విచారణకు వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ సభ్యు లుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి(శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస రావు(ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి(తిరుపతి), వి.భూషణం (గుంటూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌), వెంకటరావు(విశాఖ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌), రామకృష్ణ(ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌), జి.ఎల్‌.శ్రీనివాస్‌(ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌), మొయిన్‌ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్‌ (అనంతపురం ఏసీబీ), శివప్రసాద్‌(ఏసీబీ ఇన్‌స్పె క్టర్‌) నియమించింది. ఈసీ వేటు వేసిన అధికారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది.