తెలుగుయువత నేత గోళ్ల సురేష్‌యాదవ్
పల్నాడు జిల్లా, మహానాడు: హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా పరారయ్యారని జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్ యాదవ్ ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం కారంపూడిలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు తప్పించుకోవడానికి కొంతమంది పోలీసు అధికారులు సహకరించారన్నారు. ఎన్నికల కమిషన్ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.