హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని శుక్ర వారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీష్‌రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.