మేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం

హైదరాబాద్‌: మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం లో బరాజ్‌ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపు ణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ పనుల ను ప్రారం భించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులను చేపట్టాలని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ఇరిగేషన్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్‌-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తిపెట్టారు. 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్‌, దాని పక్కన ఉన్న పిల్లర్‌ గేట్లను ఎత్త డంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వారు వెల్లడిరచారు.