ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హతం

ఖమ్మం జిల్లాలో గోపాలపేటలో దారుణం

ఖమ్మం, మహానాడు :  ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య చేసిన కసాయి ఉదంతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), రaాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయా లంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా నిందితుడు వేధిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు చెబుతున్నారు.