చిన్నపిల్లల వైద్యనిపుణుడు కె.వినోద్‌కుమార్
శ్రీకాకుళంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ
జేసీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం
శ్రీకాకుళం: ఆకస్మిక గుండెపోట్లతో వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, వీటిని కొంతవరకు నియంత్రించుటకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నడుం బిగించిందని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణు లు కూర్మాన వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుండెపోటు`ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సరైన సమయం లో సీపీఅర్ ప్రక్రియతో ఆగిన గుండెకు పునర్జీవనం సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షుడు బగాది ప్రవీణ్‌కుమార్, సెక్రటరీ సింగూరు ప్రవీణ్, ట్రెజరర్ ఐతమ్ వెంకటేష్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంది రా ప్రసాద్, ఎస్.జోగినాయుడు, గేదెల లక్ష్మి, ఎం.మల్లిబాబు, ఎండ మోహన్, బి.దేవీప్రసాద్, క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.