ధ్రువీకరించిన అధికారిక మీడియా
హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి రెన్క్యూ బృందాలు
మీడియాకు ఫొటోల విడుదల
ఇరాన్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. తూర్పు అజర్‌బ్కెజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే భారీవర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ వారిని గుర్తించింది. ముక్కలైన హెలికాప్టర్ ఫొటోలను మీడియాకు విడుదల చేసింది. ఒక్కరూ ప్రాణాలతో లేరని అధికారులు వెల్లడిరచారు.