ఇరాన్: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియమి తులయ్యా రు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్య క్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటిం చారు.