జూన్‌ 4 కూటమి విజయోత్సవాలకు సిద్ధం కండి

వైసీపీ గెలుపు ప్రకటనలు మేకపోతు గాంభీర్యమే
దాని పతనాన్ని చూసేందుకు దేశం ఎదురుచూస్తోంది
కూటమి విజయంలో జనసేనదే కీలకపాత్ర
పూర్తిస్థాయిలో బదిలీ అయిన జనసేన ఓట్లు
జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి

విజయవాడ, మహానాడు : వైసీపీ ప్రభుత్వ పతనాన్ని, ఘోర ఓటమిని చూడటం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జూన్‌ 4న ఫలితాల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయంటూ వైసీపీ మంత్రులు రోజుకొక్కరు మాట్లాడటంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నిరంకుశ పాలనపై తమ కోపాన్ని ప్రజలు ఓట్ల రూపంలో తీర్చుకున్నారని పేర్కొన్నారు. వారి గెలుపు జపం మేక పోతు గాంభీర్యమేనన్న విషయం రాష్ట్రంలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతా రన్నారు. ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకే మొగ్గుచూపారన్నారు. కూటమి గెలుపులో జనసైనికుల పాత్ర కీలకంగా మారినట్లు చెప్పారు. ఎన్నికల సమయం లో అరాచకాలు సృష్టించాలన్న వైసీపీ దుర్మార్గ ఆలోచలకు అడ్డుగోడగా నిలిచిం ది జనసైనికులేనని వ్యాఖ్యానించారు. కొన్నిచోట్ల కూటమి అభ్యర్థులతో సమన్వ య లోపాలున్నా వాటిని పట్టించుకోకుండా జనసేన ఓట్లు పూర్తిగా కూటమికి బదిలీ అయ్యేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కృషి చేశాయన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు జూన్‌ 4న విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.