రెడ్‌జోన్‌గా స్ట్రాంగ్‌రూమ్‌లు

భారీ బందోబస్తుతో పర్యవేక్షణ
డ్రోన్స్‌ ఎగురవేస్తే చర్యలు
సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిఘా
విజయవాడ పోలీసు కమిషనర్‌ రామకృష్ణ

అమరావతి, మహానాడు : స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ తెలిపారు. పోలింగ్‌ సమయంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగాయని వివరించారు. రెండు సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ పోలీసులు సుమారు 400 మంది పోలీసు బందోబస్తు విధుల్లో ఉన్నారని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తామని, పేషియల్‌ కెమెరాల ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌లకు వచ్చే వారిని గుర్తిస్తున్నామని తెలిపారు. వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేసామని, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సెక్షన్‌ 144 అమలులో ఉంది. కర్రలు, మారణాయుధాలతో తిరగరాదని, బాణాసంచా పేల్చే అనుమతి లేని కారణంగా అవి విక్రయించే షాపులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించామని, డ్రోన్స్‌ ఎగురవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.