అమెరికాలో తెలుగుమహిళకు అరుదైన గౌరవం

సుపీరియల్‌ కోర్టు జడ్జిగా జయ బాదిగ

విజయవాడ, మహానాడు : అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. విజయవాడకు చెందిన జయ బాదిగ శాక్రమెంట్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితు లయ్యారు. కాలిఫోర్నియాలో నియమితులైన తొలి తెలుగు జడ్జిగా నిలిచారు. ఆమె హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే ఆమె జడ్జిగా నియామకం కావడంతో అక్కడి ప్రవాసాంధ్రులతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు.