పెండిరగ్ జీతాలు తక్షణమే చెల్లించాలి
మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్
హైదరాబాద్, మహానాడు : కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ సిబ్బందికి నాలుగు నెలల పెండిరగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామకపత్రాలు అందించి తర్వాత గాలికివదిలేసిందని మండిపడ్డారు. దీంతో జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్న ట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి పెండిరగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను తక్షణం చెల్లించాలని కోరారు.