గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు
సమస్యాత్మక ప్రాంతాలలో అణువణువునా తనిఖీలు

సత్తెనపల్లి, మహానాడు : కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో సత్తెనపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. సత్తెనపల్లి సర్కిల్‌ సీఐ రాంబాబు తన సిబ్బందితో అల్లర్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా అప్ర మత్తమయ్యారు. బాంబులు, కత్తులు, మారణాయుధాలు, కర్రలు, గొడ్డలు రాళ్లు ఏమైనా దొరుకుతాయేమోనని కంపలు, గుట్టలు, కొట్టాలు, చెత్త దిబ్బలు, రహ స్య ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. కౌంటింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనల కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రధాన ప్రాంతాలలో అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముప్పాళ్ల మండలం తొండపి, సమస్యాత్మక గ్రామాలలో తనిఖీ చేశారు.

ప్రత్యేక నిఘా

తనిఖీల సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ యువత అనవసరమైన గొడవలకు పాల్పడి వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. గత కేసుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో చెలరేగిన గొడవలు, అల్లర్లకు పాల్పడిన వారి మీద ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో తన సిబ్బందితో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాత కేసులు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని వివరించారు. ఎవరైనా రెండు మూడు కేసులతో సంబంధం కలిగి ఉంటే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు అవుతాయని, రౌడీ షీట్లు కూడా ఓపెన్‌ చేస్తామని వివరించారు. వాహ నదారుల దగ్గర బండి లైసెన్స్‌ పత్రాలు లేకపోయినా, నెంబర్‌ ప్లేట్స్‌ లేకపోయి నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, వీడియోల ఆధారంగా కూడా గొడవలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని వివరించారు.