తెలంగాణ: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బుధవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ ఎస్.వాణికి జూడాల సంఘం నేతలు మంగళవా రం నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్ ప్రతినెలా సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవే ర్చాలని కోరుతున్నారు.