పూర్ణారెడ్డి ఉపయోగించినట్లు గుర్తింపు
చిత్తూరు మూలాలపైనా పోలీసుల ఆరా
అమరావతి, మహానాడు : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్‌రెడ్డి వాహనంపై సీసీబీ పోలీసులు దృష్టిసారించారు. పార్టీ సమయంలో ఆ వాహనాన్ని పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. పోలీసుల రైడ్స్ సమయంలో అతను ఫామ్ హౌస్ నుంచి పారిపోయాడు. ఈ కేసులో చిత్తూరు మూలాలపైనా ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏ2గా అరుణ్‌కుమార్, ఏ4గా రణధీర్‌బాబు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. రణధీర్‌బాబు డెంటిస్ట్‌గా, అరుణ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.