రాష్ట్రంలో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు

అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసా గుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం నుంచి జూన్‌ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్ఠంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్‌ తుఫాన్‌ బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. అటు తెలంగాణలోనూ జూన్‌ 1 వరకు పొడి వాతావరణం కొనసాగనుంది.