మాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత

-ఎన్టీఆర్‌ కేబినెట్‌లో గుర్తింపు
-సంతాపం ప్రకటించిన చంద్రబాబు

విజయవాడ, మహానాడు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె 1985,1994లలో ముదినేపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1988లో ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఎన్నికైన సీతా దేవి, విద్యాశాఖా మంత్రిగా తనదైన ముద్ర వేశారని అన్నారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.