జగన్‌ పై రాయి దాడి నిందితుడికి బెయిల్‌

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు మంగళవరం తీర్పు చెప్పింది. పోలీసు విచారణకు సతీష్‌ సహకరించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 13న బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో జగన్‌పై రాయి దాడి చేశాడన్న కారణంతో ఏప్రిల్‌ 18న సతీష్‌ను అరెస్టు చేశారు.