– పేట్రేగిన వారికి త్వరలోనే బుద్ధి చెబుతాం
– మాచర్ల ప్రజల చేతిలోనే బడితపూజ ఖాయం
– ఆయనను మాచర్ల నుంచి బహిష్కరించాలి
– జగన్ రెడ్డి అండ చూసుకునే దుర్మార్గాలు
– గ్రానైట్ రాళ్లతోనే నీకు సరైన సమాధానం
– రూ.2 వేల కోట్లు అడ్డంగా దోపిడీ చేశావు
– వందల ఎకరాలు భూములు కబ్జా చేశావు
– నేర సామ్రాజ్యంతో విర్రవీగిపోతున్నావు
– కూటమి రాగానే శిక్ష పడేలా చేస్తాం
– పిన్నెల్లి పైశాచికం పుస్తకావిష్కరణలో టీడీపీ నేతల ధ్వజం
మంగళగిరి: ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారా స్థాయికి చేరిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీ విధానాలపై తెలుగుదేశం పార్టీ పిన్నెల్లి పైశాచికత్వం అనే పుస్తకాన్ని రూపొందించింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఈ పుస్తకాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావు, మరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ధారూనాయక్, హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు పిన్నెల్లిపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు
బుద్దా వెంకన్న మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి హయాం లో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అతను గెలిచాడు. అప్పటినుంచి అతను, అతని సోద రుడు చేసే అరాచకాలకు అడ్డురాకుండా ఏలుతున్నాడు. అధికారాన్ని అడ్డుపె ట్టుకుని పిన్నెల్లి 2 వేల కోట్ల దోపిడీ చేశాడు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయి. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయి. ఎన్నికల రోజున మేము మాచర్లకు వెళితే మా తరపున వచ్చిన లాయర్ కిశోర్‌పై కూడా దాడి చేసి తల పగులగొట్టారు. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా నేర చరిత్రే.
దొంగతనం చేయలేదని ప్రమాణం చేస్తావా?
జగన్‌ది కూడా నేర మనస్తత్వం అందుకే జగన్‌కు పిన్నెల్లి అంటే ఇష్టం. దేవాల యాల్లో విగ్రహాలు దోచుకోలేదని పిన్నెల్లి మాచర్ల సెంటర్లో భార్యా, పిల్లలతో వచ్చి ప్రమాణం చేయగలవా అని చాలెంజ్ విసిరారు. సోదరుడు కూడా దొంగే. ఇద్దరు కలిసి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. గతంలో ఎన్నిక లప్పుడు అనేక చోట్ల రీ పోలింగ్ జరిగేది. నేడు రీ పోలింగ్ ఎక్కడా జరగడంలేదు. ఒక్క మాచర్లలోనే జరుగుతోంది. పిన్నెల్లి అక్కడి ఈవీఎంలను పగలగొట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఓట్లు పడలేదని ఓర్వలేక అక్కడ అరాచకాలు సృష్టించి ఈవీఎంలు పగులగొట్టారు. నియోజకవర్గం మొత్తం ఎన్నికలు ఆపేయాలని పన్నాగం పన్నారు.
గ్రానైట్ రాళ్లంటే ఇష్టం
ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్‌పై ట్యాక్స్ వేసి దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. కొందరికి అన్నం, కూర అంటే ఇష్టమైతే పిన్నెల్లికి గ్రానైట్ రాళ్లంటే ఇష్టం. ఎవరిమీదైనా కోపమొస్తే ఆ రాళ్లతోనే కొట్టి ఆ ముచ్చట తీర్చుకుంటాడు. ఆత్మకూరు, రాయవరం, అలు గురాజుపల్లి, అడిగొప్పల, అమ్మవారిగుడి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాల్లో దాదాపు 70 కోట్లు కొట్టేశారు. కన్నగుంట్ల, వేల్పూరు మండలంలో కంకర తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. మాచర్లలో సీసీ రోడ్లు వేసినా, ఎక్కడైన కాలువ మరమ్మ తులు చేసినా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా పిన్నెల్లికి 5 శాతం వాటా కావాలి. 10 లక్షల వర్క్ జరుగుతుంటే దాంట్లో రూ.50 వేలు లంచం ఇవ్వాల్సిందే. రైతులు తమ పొలాల పాస్ పుస్తకాలకు అప్లై చేస్తే రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
జగన్‌ని మించిన సైకో పిన్నెల్లి. రేపు పలానా పలానా వారు వస్తున్నారు. వారిపై దాడి చేసి చంపితే ఇంతిస్తానని వేలం పాట పెట్టాడు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటి దాక ఆ తురకా కిశోర్‌కి కౌన్సిలర్ సీటు కూడా లేదు. 2024 తరువాత ప్రజల చేత సమాధానముంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో చక్కగా తిరగగలవా? మాచర్ల ప్రజలే నీకు గ్రానైట్ రాళ్లతో బుద్ధి చెబుతారు.
అల్లర్లకు కారణమైనవారికి త్వరలోనే బుద్ధి చెబుతాం
హైకోర్టు అడ్వకేట్ కిషోర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్చి 11న మాచర్లలో జరిగిన హింసలో గాయపడ్డాను. మాచర్లలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండదు. కొందరు పోలీసులు యూనిఫామ్ కూడా వేసుకోరు. పిన్నెల్లి పాలేరుల్లా కొందరు పోలీసులు ఉన్నారు. వారిలో ఒకతను భక్తవత్సల రెడ్డి. అతను ఒంగోలు వెళ్లినా పిన్నెల్లి సేవలోనే తరిస్తున్నాడు. మా మీద జరిగిన దాడిలో పోలీసులు సక్రమంగా వ్యవహరించేలేదనే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. వేసవి తరువాత విచారణ జరుగుతుంది. ఈవీఎం ధ్వంసం కేసులో బెయి ల్ తెచ్చుకున్నాడు. పిన్నెల్లిపై ఇంకా 307, హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. వాటిపై కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. మాపై దాడి చేయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదు. పోలీసు గన్ మెన్ ఎక్కడుం టాడో వారికి తెలుసు.. అతనే ఈ కథంతా నడిపాడు. కారంపూడిలో హింస చేశా రు. పోలీసులకు బాస్‌లా వ్యవహరిస్తున్నాడు. ఇది ఎక్కువ రోజులు సాగదు. ప్రజా స్వామ్యబద్దంగా వారికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
పిన్నెల్లికి ప్రజల చేతిలో బడితపూజ తప్పదు
పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికత్వంతో విర్ర వీగాడు. అన్ని వివరాలతో నేడు పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఐదేళ్లలో పిన్నెల్లి విపరీతమైన అరాచకాలు సృష్టించాడు. అనేక దారుణాలకు పాల్పడ్డాడు. 200 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దోపిడీ చేశాడు. పిన్నెల్లి రోడ్డుపైకి వస్తే బందిపోటు దొంగలను కొట్టినట్లుగా కొడతారు.
పిన్నెల్లిని మాచర్ల నుంచి బహిష్కరించాలి
ధారూ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం గురించి చర్చ నడుస్తోంది. నియోజక వర్గానికి మచ్చ తెచ్చిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు. 20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి మాచర్లలో అభివృద్ధిని ప్రజలకు దూరం చేశాడు. పిన్నెల్లి పాలనలో మాచర్ల నియోజకవర్గంలో వందలాది కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. పిన్నెల్లి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పిన్నెల్లి తన రాజకీయ లబ్ధికోసం అణగదొక్కుతూ వచ్చాడు. తాగడానికి మంచినీళ్లు అడిగితే గిరిజన మహిళ సామూ బాయిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య, జాలయ్యలను దారుణంగా పిన్నెల్లి అనుచరులు హత్య చేశారు. ఎస్సీ, ఎస్టీల భూములను కూడా పిన్నెల్లి దోచుకున్నాడు. నాగార్జు నసాగర్ రోడ్డులో 30 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఎత్తిపోతల వద్ద కొంత భూమి, విమానాశ్రయం వద్ద 200 ఎకరాల భూమి కబ్జాకు గుర య్యాయి. మాచర్లలో ఎక్కడ చూసినా కబ్జాలే. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నాగార్జునసాగర్ ఎస్ఐ పూర్తిగా వైసీపీ ఏజెంట్లా పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయిస్తోంది. పిన్నెల్లిని మాచర్ల నుంచి బహిష్కరించాలి. సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
జగన్‌రెడ్డిని చూసుకుని పిన్నెల్లి ఆగడాలు హద్దు మీరాయి
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ పాలనలో పల్నాడు వల్లకాడుగా మారింది. పిన్నెల్లి పైశాచికం, రూ.2లక్షల ఆదాయం నుంచి రూ.2 వేల కోట్ల స్థాయికి ఎలా ఎదిగాడో జగన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఓ కేస్ స్టడీ. ఈవీఎంలను బద్దలు కొట్టిన వాడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాల్సింది పోయి..పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందో విచారణ చేయాలని సిగ్గువిడిచి మాట్లాడుతున్నారు. పిన్నెల్లి చేసిన అరాచకాల్లో 79 కేసుల్లో 51 కేసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై చేసిన దాడు లకు సంబంధించినవే. చేరెడ్డి మంజుల అనే టీడీపీ పోలింగ్ ఏజెంట్ పై పిన్నెల్లి అనుచరులు గొడ్డలితో దాడి చేసినా మంజుల ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంది. పల్నాటి పౌరుషాన్ని తెలియజేసింది. సరస్వతి పవర్ భూము ల కుంభకోణంలో పిన్నెల్లి సోదరులు రైతులపై దాడులు చేశారు. అప్పటి నుంచి పిన్నెల్లి అరాచకాలు మొదలయ్యాయి. సీఐపై పిన్నెల్లి దాడులు చేసినా వైసీపీ పాలనలో పట్టించుకోలేదు. ఇలాంటి పిన్నెల్లికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. రానున్న కాలంలో పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. పిన్నెల్లిపై ఉన్న కేసులన్నింటినీ కోర్టులో నిరూపించి తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం.