గన్నవరం: పవిత్ర హజ్ యాత్ర రెండో బృందానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ బుధవారం మధ్యాహ్నం గన్నవరం ఈద్గా జామా మసీద్ హజ్ క్యాంప్ దగ్గర పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 322 మందితో విమానంలో జెడ్డా బయలుదేరివెళ్లారు. వక్ఫ్ బోర్డ్ సీఈవో, హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హజ్ కమిటీ సభ్యులు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్‌వలి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ యాత్రికుల కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా 48 మందితో మూడో బృందం వెళతారని కమిటీ తెలిపింది.