జవహర్‌రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలి

-గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం: సీఎస్‌ జవహర్‌రెడ్డి నిబద్ధతను నిరూపించుకోవాలని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎస్‌ జవహర్‌రెడ్డి, అతని కుమారుడిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రొసీజర్‌ను పక్కనపెట్టి పనులు చక్కపెట్టుకున్నారని, 596 జీవో ఇచ్చాక ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఎవరికి ఇచ్చారో మొత్తం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ వచ్చాక భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు రాజమండ్రి నారాయణ, మీడియా కోఆర్డినేటర్‌ కె.గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.