కేంద్రంలో రైల్వే శాఖను తప్పనిసరిగా తీసుకోవాలి
కేంద్ర సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటు చేయించాలి
అమరావతి నగర నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి
ఐకానిక్ బ్రిడ్జి, ప్రజావేదిక నిర్మాణం చేయించాలి
ఆరునెలల పాటు హామీల అమలును వాయిదా వేయండి
ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయించాలి
కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా అది తెలుగుదేశం, జనసేనల సహకారం లేనిదే సాధ్యంకాని రీతిలో ఫలితాలు రాబోతున్నాయి..కాబట్టి తెలుగుదేశం, జనసే న పెద్దలకు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఎటువంటి అప్రాధాన్య శాఖలు తీసుకోకుండా రైల్వేశాఖను తప్పనిసరిగా డిమాండ్ చేసి మరీ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు ఆంధ్ర రాజధాని అమరావతిలో కూడా రానున్న ఐదేళ్లలో ఏర్పాటు చేయించాలి!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులు
` ప్రజావేదిక పునర్నిర్మాణం, అలాగే కృష్ణానది పవిత్ర సంగమం వద్ద ఐకానిక్ బ్రిడ్జి, అమరావతి నగర నిర్మాణం పనులు తక్షణం ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించకుండా, ముంపు ప్రాంతాల ప్రజానీకానికి అన్ని రకాల రక్షణ, తోడ్పాటును ఇస్తూ కేంద్రం నుంచి నిధులు రాబట్టి అవసరమైతే అప్పు చేసి అయినా సరే రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలి.
` హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరును, గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును సత్వరం పెట్టాలి. యువతరానికి ఉద్యోగ కల్పనకు ఐటీ కంపెనీల వారికి భారీ రాయితీలు ఇచ్చి అయినా సరే విశాఖ, అమరావతి, తిరుపతిలలో ఏర్పాటు చేయించాలి.
` అమరావతి, అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేను సత్వరం చేపట్టాలి. మచిలీపట్నం పోర్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి ఖమ్మం, విజయవాడ, మచిలీపట్నం రహదారికి అనుసంధానం చేయించాలి.
` ప్రకాశం బ్యారేజి నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ మధ్య ఉన్న అన్నింటినీ ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ స్థలాలలో ఏర్పాటు చేయించి అక్కడి ప్రాంతాన్ని టూరిస్ట్ పరిశ్రమగా అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తక్షణం పనులు సాగేలా పూనుకోవాలి. అలాగే నగరంలో కాలువ గట్లను సుందరీకరణ, ఆక్రమణ లను తొలగించి ప్రత్యామ్నాయం చూపించాలి. ఏ ఒక్కరి జోక్యాన్ని ఆమోదిం చవ ద్దు. ఇది లక్షలాది ప్రజల ఆరోగ్య, ప్రయాణ ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య.
` ఒక్క వృద్ధుల పెన్షన్ మినహా అన్నీ రకాల హామీల ఆచరణను ఓ ఆరునెలల పాటు వాయిదా వేయండి. అప్పుల పాలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం అవసరం.
` సోలార్ పవర్ ఉత్పత్తిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పెద్దఎత్తున ప్రారంభించా లి. దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ ప్రభుత్వ బాధ్యత.. ఎటువంటి మినహాయింపులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంలోని సంఘాలను, దుష్టశక్తులను ఏరివేయాలి.
` ఆఖరుగా అమరావతి నగర నిర్మాణ పనులు ప్రారంభించే ముందు అన్ని పార్టీ ల, వర్గాల నాయకులను ఆహ్వానించి, రాష్ట్ర ప్రజలకు ఏర్పాటు చేస్తున్న రాజధాని నిర్మాణంలో అందరి బాధ్యత, సహకారం అవసరమని, ముఖ్యమంత్రులు మారినా అమరావతి నిర్మాణం జరుగుతూనే పోవాలని, ఓ పూర్తి స్థాయి నగర నిర్మాణం జరగటానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుందని వివరించి, అందరి సహకా రం తీసుకోవడం మీ బాధ్యత. ఆంధ్ర ప్రజలు, అమరావతి అభివృద్ధి చెందటమే నా ఆశయం.
` జి.వి.రామ్‌ప్రసాద్,
విజయవాడ