ఇక దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల: దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేం దుకు అనుమతించనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్‌ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకురావొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.