ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలి
బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశం
మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖకు కీలక సూచనలు
మంగళగిరి : రాష్ట్రంలో పసి పిల్లలను విక్రయించినా, అనధికారికంగా దత్తత స్వీకరించినా అటువంటి వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక నెల నుంచి ఏడాది లోపు శిశువులను వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించి సంతానం కలగలేని దంపతులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల కేంద్రాలుగా కొన్ని లక్షలకు విక్రయిస్తున్నట్లు బయటపడిరదన్నారు. కొంతమంది అంతరాష్ట్ర మధ్యవ ర్తుల ముఠాను పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగిం దని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది శిశువులను గుర్తించి హైదరాబాద్లోని శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు అధికారులు తక్షణమే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి ఆ బాలల వివరాలు సేకరించడంతో పాటు రాకెట్ వెనుక ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రులలో నిఘా ఉంచాలి
రాష్టంలో ప్రభుత్వ, ప్రైవేటే ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలు, క్లినిక్లలో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. గ్రామస్థాయిలో అంగన్వాడీ, సచివా లయ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే శిశువుల విక్రయాల అంశంపై ఎటువంటి సమాచారం అందినా సుమోటోగా తీసుకుని చర్యలు చేపడుతుందన్నారు.