అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు పి.శ్రీలేఖ, ఎ.మురళి, ఓ.రాంభూపాల్రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.