సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర ఉజ్వ ల భవిష్యత్తు సాధనే లక్ష్యంగా త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ నున్న దార్శనికులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు మీడియాకు వివరించారు.